Top
logo

గూగుల్‌లో కేటీఆర్ అని కొడితే.. దోపిడీ దొంగ అని వస్తోంది: కోమటిరెడ్డి

గూగుల్‌లో కేటీఆర్ అని కొడితే.. దోపిడీ దొంగ అని వస్తోంది: కోమటిరెడ్డి
X
Highlights

అహంకారం, అధికార మదమెక్కి కేటీఆర్ మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు....

అహంకారం, అధికార మదమెక్కి కేటీఆర్ మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. లోఫర్ పార్టీగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి.. గూగుల్‌లో కేటీఆర్ అని కొడితే.. దోపిడీ దొంగ అని వస్తుందన్నారు. మిషన్‌ భగీరథలో సగం కాంట్రాక్టులు కేటీఆర్‌కు చెందినవేనని.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే తరచూ విదేశాలకు వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ చేతగానితనం వల్లే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.

Next Story