‘గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు’

‘గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు’
x
Highlights

ఏడాది కాలంగా తాను అమ్మవారికి ఒక భక్తురాలిగానే సేవలందించానని చెప్పారు దుర్గగుడి పాలకమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత. భక్తుల ఇబ్బందులు తెలుసుకుని,...

ఏడాది కాలంగా తాను అమ్మవారికి ఒక భక్తురాలిగానే సేవలందించానని చెప్పారు దుర్గగుడి పాలకమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత. భక్తుల ఇబ్బందులు తెలుసుకుని, పారదర్శకంగా సేవ చేశానని చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేని, నిరూపించుకునేందుకు తాను ఎంతవరకైనా వెళ్తానన్నారు. ఆలయంలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేయడమే నేరంగా తనను చీరదొంగగా ముద్రించి బయటకు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా నాపై నిందలు వేశారని ఆమె తెలిపారు. దుర్గగుడిలో ఓపీడిఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గతంలో బాధిత మహిళలు శంకరబాబుపై ఫిర్యాదు చేసినా చైర్మన్‌ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులను గౌరంబాబు పట్టించుకోకపోవడమే కాకుండా శంకరబాబును వెనకేసుకొచ్చేవాడని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories