బటన్ నొక్కితే మటాషే

బటన్ నొక్కితే మటాషే
x
Highlights

పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పరిస్థితి.. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుంటే.. అందరి దిమ్మ తిరిగి మైండ్...

పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పరిస్థితి.. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుంటే.. అందరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఓ ప్రకటన ఇచ్చాడు.. తన టేబుల్ పై న్యూక్లియర్ బటన్ ఉందని అది నొక్కితే మటాషేననీ ప్రకటించాడు.. తమదిప్పుడు పరిపూర్ణ అణ్వస్త్ర దేశమన్నాడు. ప్రపంచమంతా ఓపక్క న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుంటే.. కొత్త సంవత్సరమంతా ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటుంటే.. నార్త్ కొరియా దేశాధిపతి కిమ్ జాంగ్ మాత్రం వయలెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు.. తమను తాము అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్నాడు.. అంతేకాదు తమ అణ్వస్త్ర తయారీ లక్ష్యం పూర్తయిందని ఇకపై న్యూక్లియర్ వార్ హెడ్లు, బాలిస్టిక్ మిసైళ్లు మరిన్ని తయారు చేసి వాటిని వేగంగా మోహరించాలని ఉత్తర కొరియా అధికారులకు న్యూ ఇయర్ సందేశం ఇచ్చాడు. ఉత్తర కొరియా క్షిపణులకు అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకే శక్తి ఉందని అమెరికా మొత్తం తన క్షిపణి రేంజ్ లో ఉందని బెదిరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపైనే ఉత్తర కొరియా దృష్టి పెట్టింది.

కొత్త సంవత్సరంలో కూడా తమ క్షిపణుల తయారీని కొనసాగిస్తామని, ఉథృతం చేస్తామని కిమ్ జాంగ్ స్పష్టం చేశాడు. 2017లో న్యూక్లియర్ పవర్ దేశంగా గుర్తింపు పొందడానికి పాంగ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలున్నా.. అమెరికా వద్దని ఆదేశించినా కొరియా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. మిస్సైల్ బటన్ ఎప్పుడూ తన డెస్క్ పైనే ఉంటుందని.. తాను స్విచ్ ఆన్ చేస్తే విధ్వంసమేనని కిమ్ మరోసారి ప్రకటించాడు. ఈ మధ్య కొన్ని నెలలుగా క్షిపణులు తయారీ, వాటి ప్రయోగాలను కిమ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును కొరియా ఈమధ్యే పరీక్షించింది.కొరియాను న్యూక్లియర్ దేశంగా ప్రపంచం గుర్తించిందనీ.. కొత్త సంవత్సరంలో మరిన్ని క్షిపణుల తయారీ, ప్రయోగం వేగంగా సాగాలంటూ కిమ్ జాతికి సందేశం ఇచ్చాడు.

మరోవైపు కొరియా పరీక్షల పట్ల అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. కిమ్ ఆత్మాహుతి దళంలా తయారయ్యాడంటూ డోనాల్డ్ ట్రంప్ విమర్శించారు. తాము తలుచుకుంటే.. కొరియా క్షిపణి పరీక్షా కేంద్రాన్నే ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. అయితే ట్రంప్ వార్నింగులకు భయపడని కిమ్ మరింత రెచ్చిపోతున్నాడు.. తాము దేనికైనా సిద్ధమని అమెరికా చర్యలను గట్టిగా తిప్పికొట్టే సత్తా తమకుందని బదులిచ్చాడు. అమెరికా ఇక ఎంతకాలమూ బ్లాక్ మెయిల్ చేయలేదు.. ఉత్తర కొరియా అణుసత్తా కలిగిన దేశం అన్నది వాస్తవం అని కామెంట్ చేశాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగులు కిమ్ ను భయపెట్టక పోగా మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.. ట్రంప్ హెచ్చరిస్తున్న కొద్దీ కిమ్ మరింత చెలరేగిపోడం చూస్తుంటే.. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నట్లుగా అనిపిస్తోంది.

అమెరికా కొన్నాళ్లుగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో జాయింట్ గా సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. దీన్ని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక కొరియా దూకుడుపై ఐక్య రాజ్య సమితి కూడా కన్నెర్ర చేసింది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి.. కొరియా ఇదే తీరున కొనసాగిస్తే.. ఆ దేశ నాయకత్వాన్ని అధీనంలోకి తీసుకోక తప్పదని హెచ్చరించాయి. గతనెలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కొరియాకు ఆయిల్ సరఫరాను తగ్గించేయాలని ప్రపంచ దేశాలకు సూచించింది. కొరియా తీరుపై ప్రపంచం అంతా ఇలా స్పందిస్తుంటే చైనా మాత్రం నా రూటే సెపరేటు అంటోంది..కొరియాతో అంటకాగుతోంది. రహస్యంగా ఆ దేశానికి ఆయిల్ సరఫరా చేస్తోంది. చైనా పంపిన ఎన్నో చమురు సరఫరా నౌకల్ని కొరియా చుట్టు పక్కల దేశాలు మధ్యలోనే అడ్డుకున్నాయి. ఉత్తర కొరియా చాలా ప్రశాంతమైన దేశమని.. కొరియా ద్వీపకల్పంలో పెరుగుతున్న మిలటరీ టెన్షన్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాము క్షిపణి తయారీ చేస్తున్నామంటున్నాడు కిమ్ జాంగ్..

తొలగిపోవాలని ఆ దేశం కోరుకుంటోంది. అందుకే అమెరికాకు తలవంచకుండా పోరాడతామంటూ హడావుడి చేస్తోంది.అయితే కిమ్ జాంగ్ పొగరు, తలబిరుసు కారణంగా ఈ లక్ష్యం సాధించడం కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు శాంతి చర్చలకు రావాలంటూ ఎప్పటినుంచో పిలుపునిస్తున్న దక్షిణ కొరియా సూచనలకు కిమ్ జాంగ్ స్పందించాడు..దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్స్ పోటీలలో పాల్గొనేందుకు తాము సిద్ధమని.. చర్చలకు కూడా రెడీగానే ఉన్నామని ప్రకటించాడు.. కిమ్ నోటమ్మట ఈ మధ్య కాలంలో వచ్చిన శాంతి మంత్రం ఇదే.

Show Full Article
Print Article
Next Story
More Stories