కిడారి, సివేరి హత్యల వెనక నమ్మకద్రోహం...మావోయిస్టులకు సహకరించిన...

కిడారి, సివేరి హత్యల వెనక నమ్మకద్రోహం...మావోయిస్టులకు సహకరించిన...
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన కిడారి, సివేరి సోమల హత్య కేసులో సొంత పార్టీ నేతల హస్తముందా ? పక్కన తిరేగే వారే నమ్మించి ద్రోహం చేశారా ?...

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన కిడారి, సివేరి సోమల హత్య కేసులో సొంత పార్టీ నేతల హస్తముందా ? పక్కన తిరేగే వారే నమ్మించి ద్రోహం చేశారా ? కిడారిని పథకం ప్రకారం లివిటిపుట్టుకు వచ్చేలా చేశారా ? జంట హత్యల తర్వాత పోలీస్ స్టేషన్ల మీద దాడి వెనక గంజాయి మాఫియా ప్రేమయముందా ?

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో పోలీసులు అనుమానించినట్టే సొంత పార్టీ నేతల ప్రమేయం బయట పడుతోంది. మావోయిస్టులు ఇంత భారీ స్ధాయిలో పథకం రచించడం వెనక కుట్ర కోణం ఉందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కిడారి పర్యటన వివరాలు సేకరించిన పోలీసులు ఎవరెవరు పాల్గొన్నదానిపై లోతుగా దర్యాప్తు జరిపారు. పలువురి వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి కాల్ డేటాను విశ్లేషించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మావోయిస్టులకు సహకరించిన వారిలో ఓ మండల స్థాయి నాయకుడితో పాటు గ్రామస్థాయి నేత మరోకరు ఉన్నట్టు నిర్ధారించారు. వీరిలో మండల స్ధాయి నేతకు గంజాయి స్మగ్లింగ్‌, అక్రమ రవాణా కార్యకలాపాల్లో ప్రేమయమున్నట్టు సమాచారం. ఈ ఇరువురు నాయకులు కూడా ఎమ్మెల్యే కిడారికి సన్నిహితంగా ఉంటూనే మావోయిస్టులకు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్యే లివిటిపుట్టు వచ్చేలా చేయడంలో వీరిద్దరే కీలకపాత్ర పోషించినట్టు గుర్తించారు. మూడు రోజుల క్రితం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.

దాడిలో ఎంత మంది మావోయిస్టులు పాల్గొన్నారు ? ఎక్కడి నుంచి వచ్చారు ? ఎవరు షెల్టర్ ఇచ్చారనే కోణంలో కీలక సమచారాన్ని పోలీసులు సేకరించినట్టు సమాచారం. దీంతో పాటు మావోయిస్టులకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మావోయిస్టులతో సంబంధాలు ఎలా కొనసాగిస్తున్నారు? ఎమ్మెల్యేతో వారికి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా? అనే కోణంలో సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలిసింది.

హత్యకు సహకరించినట్టు భావిస్తున్న ఇద్దరు నేతల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను విశ్లేషించారు. హత్య జరిగిన రోజు వారిద్దరూ ఎమ్మెల్యే కిడారికి ఫోన్ చేసినట్టు గుర్తించారు. వేర్వేరు సమయాల్లో ఇరువురు నేతలు వేర్వేరు ప్రాంతాల నుంచి సమాచారం సేకరించినట్టు గుర్తించారు. అయితే ఈ సమాచారాన్ని మావోయిస్టులకు ఇతర ఫోన్ల ద్వారా అందజేసినట్టు భావిస్తున్న పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories