ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి చేసింది ఇతనే..

nanireddy
Updated on: 24 Dec 2018 4:08 PM IST
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి చేసింది ఇతనే..
X

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి కారప్పొడితో దాడి చేశాడు. సెక్రటేరియట్‌లోని ఆయన ఛాంబర్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో అనిల్‌ కుమార్ శర్మ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన ముఖంపై కారం చల్లి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న భద్రతా అప్రమత్తమై పట్టుకున్నారు. కాగా అతను నరియానా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కారణంగా కేజ్రీవాల్‌ కళ్లజోడు పగిలిపోయాయి. కేజ్రీవాల్ పై దాడి సమయంలో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఏమైందో ఏమోనని పరుగులు పెట్టారు. అత్యంత భద్రత ఉండే సెక్రటేరియట్‌లో సీఎంపై ఇటువంటి దాడి జరగడాన్ని ఆప్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని విమర్శిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story