అదే జరిగితే ఉరి వేసుకుంటా: డిప్యూటీ సీఎం

అదే జరిగితే ఉరి వేసుకుంటా: డిప్యూటీ సీఎం
x
Highlights

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి...

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం..ఇది నా వ్యక్తిగతం కాదు..పార్టీ తరఫునే చెబుతున్నా ‘ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీజేపీతో వైసీపీ కుమ్మక్కై రాజీనామాల వ్యవహారాన్ని నాన్చుతున్నారని ఆరోపించారు. బీజేపీ పంచన చేరిన వైసీపీకి 2019లో పుట్టగతులు ఉండవని కేఈ అన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని కుప్పిగంతులు వేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీని విమర్శించాలని జగన్, పవన్‌ పనిగా పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని...ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. అదే జరిగితే తాను ఉరి వేసుకుంటానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories