హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారు : కేసీఆర్‌

హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారు : కేసీఆర్‌
x
Highlights

ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు...

ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని కేసీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలను త్వరలోనే పరిష్కరించి రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయన్న కేసీఆర్‌ ఆ సమస్యను పరిష్కరించేందుకు తానే చొరవ తీసుకుంటానన్నారు. ఏదిఏమైనా జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీనిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories