Top
logo

కాసేపట్లో నిజామాబాద్‌కు కేసీఆర్...గులాబీమయంగా మారిన ఇందూరు నగరం

కాసేపట్లో నిజామాబాద్‌కు కేసీఆర్...గులాబీమయంగా మారిన ఇందూరు నగరం
X
Highlights

సీఎం సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హుస్నాబాద్ సభ అనంతరం 25రోజలు గ్యాప్ తర్వాత జరుగుతున్న రెండో సభ కావడంతో...

సీఎం సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హుస్నాబాద్ సభ అనంతరం 25రోజలు గ్యాప్ తర్వాత జరుగుతున్న రెండో సభ కావడంతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌ మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. హెలిక్యాప్టర్‌లో నేరుగా సభా స్థలానికి వస్తారు. ఇందుకోసం సభా స్థలం వద్ద హెలిప్యాడ్‌ను నిర్మించారు. వచ్చిన వెంటనే కొద్దిసేపు పార్టీ అభ్యర్థులతో సమీక్షిస్తారు. అనంతరం బహిరంగసభా వేదిక పైకి వచ్చి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. టీఆర్‌ఎస్‌ జెండాలు, తోరణాలతో నగరమంతా గులాబీ మయంగా మారింది.

Image removed.

Next Story