ముహూర్తం సోమవారం.. డిసెంబర్ 26 నుంచి..

nanireddy
Updated on: 24 Dec 2018 4:37 PM IST
ముహూర్తం సోమవారం.. డిసెంబర్ 26 నుంచి..
X

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి కేటీఆర్ నియమితులైన సంగతి తెలిసిందే. కారును ఇంకాస్త స్పీడ్‌గా పరిగెట్టించేందుకు కేటీఆర్ ను ఎంపిక చేశారు కేసీఆర్. సోమవారం 11 గంటల 05 నిమిషాలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే బాధ్యతలు తీసుకోకముందే కేటీఆర్‌ తనదైన స్టైల్లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ తరపున 16 మంది ఎంపీలను గెలిపించుకోవడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. డిసెంబర్‌ 26 నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నేతలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనికోసం కేవలం పది రోజులే సమయం ఉంది కాబట్టి అందరూ కస్టపడి పనిచేయాలని కోరారు. అలాగే రెండు వారాల్లోనే జిల్లాల వారిగా పర్యటనలు చేస్తానని క్యాడర్ కు చెప్పారు.

nanireddy

nanireddy

Next Story