Top
logo

హైదరాబాద్‌లో వాజ్‌పేయి స్మారక భవనం: కేసీఆర్

X
Highlights

ప్రజలు కోరుకున్న నేత వాజ్ పేయి అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇవాళ శాసనమండలిలో వాజపేయి...

ప్రజలు కోరుకున్న నేత వాజ్ పేయి అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇవాళ శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అన్న కేసీఆర్‌ ఆయన ప్రసంగాలలో స్పష్టత ఉండేదన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాజ్ పేయి నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వీడలేదన్నారు. విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తి అన్నారు. ‘నగరంలో వాజపేయి స్మారకార్థం.. ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలి పక్షాన వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను ’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Next Story