పవన్ ఉద్యమం చేస్తే.. రావడానికి నేను సిద్ధం: కత్తి

పవన్ ఉద్యమం చేస్తే.. రావడానికి నేను సిద్ధం: కత్తి
x
Highlights

ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం నేను పోరాడుతానని ముందుకొచ్చారు సినిమా క్రిటిక్ కత్తి మహేష్. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జరుగుతున్న బంద్‌కు...

ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం నేను పోరాడుతానని ముందుకొచ్చారు సినిమా క్రిటిక్ కత్తి మహేష్. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జరుగుతున్న బంద్‌కు ఆయన మద్దతు పలికారు. విజయవాడలో వామపక్షాలు, జనసేన చేస్తున్న ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ రాష్ట్రం పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తానూ సిద్ధమేనని ప్రకటించారు. ఏపీ ప్రజలంటే బీజేపీకి ఎలా కనిపిస్తున్నారని ప్రశ్నించారు.

టీడీపీ అసమర్థ వైఖరి వల్లే బడ్జెట్లో కేంద్రం తెలుగు ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీని విస్మరించడం దారుణమని తెలిపారు. పవన్ కల్యాణ్ బంద్‌కి మద్దతు ప్రకటించడం అభినందనీయమని.. ఆయన ప్రజల్లోకి రావాలని కోరారు. పవన్ రాష్ట్రం పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తానూ సిద్ధమేనని ప్రకటించారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటానికి సినీపరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ఉద్యమంలోకి రావాలా.. వద్దా.. అనేది వారి వ్యక్తిగత విషయం అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories