పొలిటికల్ ఎంట్రీపై కత్తి క్లారిటీ.. చిత్తూరు జిల్లా నుంచే పోటీ

పొలిటికల్ ఎంట్రీపై కత్తి క్లారిటీ.. చిత్తూరు జిల్లా నుంచే పోటీ
x
Highlights

సినీ, రాజకీయ విశ్లేషకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న కత్తి మహేష్, పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తోంది. తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ఎంపీ...

సినీ, రాజకీయ విశ్లేషకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న కత్తి మహేష్, పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తోంది. తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ఎంపీ గా బరిలోకి నిలవాలన్నతన ఉద్దేశ్యాన్ని తాజాగా బయటపెట్టారు కత్తి మహేష్. ఏ పార్టీ లో జాయిన్ అయ్యేది, ఎక్కడి నుంచి పోటీ చేస్తాన్నది త్వరలోనే సగర్వంగా ప్రకటిస్తానన్నారు. ఏదో పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా నామినేట్ అయిపోవడం ఇష్టం లేదన్నఆయన, ఎవరి నుంచి పిలుపు వస్తుందో, తనను ఎవరు స్వాగతిస్తారన్నది చూడాలని అన్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. అన్ని పార్టీలతో తాను టచ్‌‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే చిత్తూరు జిల్లా నుంచే పోటీ అని చెప్పారు గానీ.. ఏ పార్టీ తరఫున అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాగా కత్తి మహేశ్ స్వస్థలం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం వాయల్పాడు అని తెలిసింది. నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో తన భాగస్వామ్యం ఉండాలనుకుంటున్నానని అందుకే ఎంపి గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలనుకున్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు సర్కారు విఫలమైందని చెబుతున్నకత్తి మహేష్, ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయకపోవడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories