గుడ్లు విసిరినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి
Highlights
తనపై జరిగిన దాడి గురించి సినీ విమర్శకుడు కత్తి మహేష్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు...
arun19 Jan 2018 11:10 AM GMT
తనపై జరిగిన దాడి గురించి సినీ విమర్శకుడు కత్తి మహేష్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత రాత్రి కారులో కత్తి మహేష్ జూబ్లీహిల్స్ నుంచి కొండాపూర్ వెళుతున్నారు. శిల్పారామం సమీపంలో కత్తి మహేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. తనపై పవన్ కళ్యాణ‌్ ఫ్యాన్స్ దాడి చేశారని కత్తి మహేష్ అనుమానం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనకు, పవన్ అభిమానులకు మధ్య నాలుగు నెలలుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తున్నందున తనపై పవన్ ఫ్యాన్సే దాడి చేసి ఉంటారని నమ్ముతున్నట్టు మహేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
లైవ్ టీవి
4 ఏళ్ల వయసులో తప్పిపోయింది .. 15 ఏళ్ల తర్వాత దొరికింది
8 Dec 2019 5:43 AM GMT11న గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన
8 Dec 2019 5:32 AM GMT14న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
8 Dec 2019 5:24 AM GMTవైసీపీకి కీలకనేత రాజీనామా..
8 Dec 2019 5:11 AM GMTహైదరాబాద్లో దారుణం : రూ.35వేల బాకీ కోసం కత్తితో దాడి
8 Dec 2019 4:47 AM GMT