కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం

కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం
x
Highlights

కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కాటసాని రామిరెడ్డి పెద్ద...

కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని నాగార్జునరెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవలే నాగర్జునరెడ్డి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రాత్రి కుటుంబసభ్యలతో కలిసి భోజనం చేసి ఇంట్లోనే నిద్రపోయాడు. ఉదయం బెడ్‌రూం నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా నాగార్జున రెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కాటసాని రామిరెడ్డి కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది. ఉరివేసుకున్న దృశ్యాలను చూసి కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. నాగార్జునరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అతనికి ఉన్న సమస్యలు ఏంటి అనే విషయాలు ఏమీ తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories