అప్పటి కలెక్షన్ల బాహుబలి " కటకటాల రుద్రయ్య "!

అప్పటి కలెక్షన్ల బాహుబలి " కటకటాల రుద్రయ్య "!
x
Highlights

" కటకటాల రుద్రయ్య " సినిమా కృష్ణంరాజు నటించిన 93వచిత్రం. కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించిన 4వచిత్రం. దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన...

" కటకటాల రుద్రయ్య " సినిమా కృష్ణంరాజు నటించిన 93వచిత్రం. కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించిన 4వచిత్రం. దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 26వచిత్రం. బంట్రోతుభార్య, యవ్వనంకాటేసింది చిత్రాల తరువాత దాసరి దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన 3వచిత్రం. మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా ఈచిత్రాన్ని తీశారు. ఈచిత్రాన్ని కృష్ణతో తీయాలనుకున్నారు దాసరి. ఐతే కృష్ణ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవటంతో కృష్ణంరాజు తో తీశారు. కృష్ణంరాజు కథ వినకుండా నటించిన ఒకేఒక చిత్రమిది. కేవలం దాసరి మీద నమ్మకంతో ఈచిత్రంలో నటించారు కృష్ణంరాజు. ఈచిత్ర క్లైమాక్స్ విషయంలో దర్శకుడు దాసరి కి నిర్మాతకు కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయి. తరువాత దాసరి క్లైమాక్సును మార్చారట. ఈచిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. దాసరి, కృష్ణంరాజు కాంభినేషన్లో వచ్చిన తొలి బ్లాక్ బస్టర్ చిత్రమిది. 26 కేంద్రాలలో 50 రోజులు, 8 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈచిత్రాన్ని 1979లో తమిళంలో శివాజీగణేషణ్, జయసుధ, శ్రీదేవిలతో వి.బి.రాజేంద్రప్రసాద్ స్వీయదర్శకత్వంలో 'పట్టాకత్తి భైరవన్' గా పునర్నిర్మించారు. హిందీలో 1989లో దాసరి దర్శకత్వంలో జితేంద్ర, వినోద్ మెహ్రా, మౌషిమి, వహీదారెహమాన్ లతో 'జ్యోతిబనేజ్వాల' పేరుతో పునర్నిర్మించారు. "కటకటాలరుద్రయ్య" చిత్ర శతదినోత్సవ వేడుకలను 21 జనవరి 1979 న మద్రాసులో విజయాగార్డెన్స్ లో నిర్వహించారు. ప్రేక్షకాదరణ పొందిన ఈచిత్రంలోని పాట “వీణనాది తీగనీది తీగచాటు రాగముంది” అనే పాట. ఇంకా విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై వచ్చిన ఈచిత్రంలో ముఖ్య తారాగణం : కృష్ణంరాజు, జయసుధ, జయచిత్ర, కైకాల సత్యనారాయణ, రామకృష్ణ, రావుగోపాలరావు, ప్రభాకరరెడ్డి, జె.వి.రమణమూర్తి తదితరులు నటించారు. ఈ సినిమా దర్శకత్వం దాసరి నారాయణరావు, నిర్మాత వడ్డే శోభనాద్రి, సంగీతం జె.వి.రాఘవులు, ఈ సినిమా నిర్మాణవ్యయం దాదాపు.. 18 లక్షలు, ఈ సినిమా వసూళ్ళు మాత్రం...75 లక్షలట. ఇప్పట వారకి ఈ సినిమా చూడకుంటే మాత్రం తప్పక చూడండి..శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories