అంత్యక్రియలకి కూడా తప్పట్లేదా ఏంటి పోరాటం?

అంత్యక్రియలకి కూడా తప్పట్లేదా ఏంటి పోరాటం?
x
Highlights

కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియల స్థల ఆరాటం, స్థల వివాదంపై హైకోర్టులో వాదప్రతివాదనల పోరాటం, మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన కావాలట, ...

కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియల స్థల ఆరాటం,

స్థల వివాదంపై హైకోర్టులో వాదప్రతివాదనల పోరాటం,

మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన కావాలట,

మాజీ ముఖ్యమంత్రులుగా పోతే అక్కడ స్థలం ఇవ్వలేరట,

చనిపోయినాక పార్థివదేహనికి తప్పట్లేద ఏంటి పోరాటం. శ్రీ.కో.


డీఎంకే చీఫ్ కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియలం కోసం స్థల వివాదంపై హైకోర్టులో బుధవారం ఉదయం వాదప్రతివాదనలు జరిగాయి. కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని డీఎంకే విజ్ఞప్తి చేయగా, పళని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో డీఎంకే కోర్టుకు ఎక్కింది. అర్ధరాత్రి విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మెరినాలో ఎందుకు వద్దంటున్నారో ప్రభుత్వం చెప్పాలని నోటీసులు ఇచ్చిన అనంతరం విచారణను బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వాయిదా వేసింది. ఉదయం వాదనలు విన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించిన దాఖలాలు గతంలో లేవని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని, ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేదని తెలిపింది. అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలితలు సీఎంలుగా కన్నుమూశారని, కాబట్టి వారికి మెరీనా బీచ్‌లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories