కొన్ని గంటల్లో బలపరీక్ష... కన్నడ క్లైమాక్స్‌లో బేరసారాల కథ

కర్ణాటకలో కథ క్లైమాక్స్‌కు చేరడంతో బేరసారాలు తీవ్రమయ్యాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ ...
కర్ణాటకలో కథ క్లైమాక్స్‌కు చేరడంతో బేరసారాలు తీవ్రమయ్యాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోంది. నిన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి ఫోన్‌లో బేరమాడగా... తాజాగా యడ్యూరప్ప తనయుడు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించినట్టు మరో ఆడియో విడుదలైంది.
తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మరోసారి ఆరోపించింది. డబ్బు, మంత్రి పదవి ఆశజూపి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని మండిపడింది. ఇప్పటిదాకా బీజేపీ నేతలే ఇలాంటి ప్రయత్నాలు చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు కూడా ప్రలోభాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనికి సాక్ష్యం ఇదిగో అంటూ ఓ ఆడియోను విడుదల చేసింది.
యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు 5కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విజయేంద్ర మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి విడుదల చేసింది. మరికొద్ది గంటల్లో యడ్యూరప్ప బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో మరింత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నిన్న కూడా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దల్‌ను బీజేపీ తరఫున మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదించారు. ఆడియో రికార్డు సారాంశం ప్రకారం.. రాజుగౌడ అనే వ్యక్తి మధ్యవర్తిత్వంలో బసవనగౌడతో గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ‘పార్టీ పెద్దలే నేరుగా డీల్ గురించి చర్చిస్తారు. నీ జీవితానికి సరిపడా సంపాదించుకునే అవకాశమిది. మంచి సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు’ అంటూ గాలి బేరాలు సాగించారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT