ఇందుకే.. ‘మణి’రత్నం అయ్యాడు!

ఇందుకే.. ‘మణి’రత్నం అయ్యాడు!
x
Highlights

సున్నితమైన కథాంశాలను హృద్యంగా తెరకెక్కించగల సామర్థ్యం.. దర్శక దిగ్గజం మణిరత్నం సొంతం. గ్యాంగ్ స్టర్ కథ అయినా.. రాజకీయ నేపథ్యం ఉన్న కథ అయినా.. ప్రేమ కథ...

సున్నితమైన కథాంశాలను హృద్యంగా తెరకెక్కించగల సామర్థ్యం.. దర్శక దిగ్గజం మణిరత్నం సొంతం. గ్యాంగ్ స్టర్ కథ అయినా.. రాజకీయ నేపథ్యం ఉన్న కథ అయినా.. ప్రేమ కథ అయినా.. మాఫియా స్టోరీ అయినా.. మణి రత్నం చేతిలో పడిందంటే.. అది ఓ దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే ఆయన సినిమా వస్తోందంటే.. ఇప్పటికీ అభిమానుల్లో అంతులేని ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది.

అంతటి దిగ్గజ దర్శకుడిని.. బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ నిర్వాహకులు.. జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు. అవార్డుతో పాటు.. 10 లక్షల రూపాయల నగదు కూడా బహుకరించారు. కానీ.. ఆ నగదును యువ దర్శకులకు సహాయం చేయడానికి వినియోగించండి అంటూ.. మణిరత్నం తిరిగి కర్ణాటక చలన చిత్ర అకాడమీకి ఇచ్చేశారు. తాను పుట్టిన బెంగళూరు నుంచి అవార్డు అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న మణి.. యువ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచాడు.

బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ నిర్వాహకులు.. జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడికి అందించారు. తనకు అందిన ఆర్థిక బహుమానాన్ని సేవా కార్యక్రమానికే వెచ్చించడంతో.. మణిరత్నం కూడా ఆ అవార్డుకు సార్థకత తెచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories