మళ్లీ కాంగ్రెస్సే..బీజేపీకి షాక్..

కర్ణాటక తిరిగి కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు...
కర్ణాటక తిరిగి కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు ఆశలకు గండిపడనుందా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే అవుననే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా తనకు సీట్లను కూడా పెంచుకోనుందట. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఆ సర్వే తెలిపింది. దక్షిణాది మినహా దేశంలో దాదాపుగా బీజేపీ పాగా వేసింది. అయితే దక్షిణాదిలో కూడా పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి ఈ సర్వేతో షాక్ తగిలింది. దక్షిణ భారతదేశంలో కేవలం కర్ణాటకలోనే బీజేపీకి ప్రాధాన్యం ఉంది. పైగా క్రీతం అక్కడ అధికారంలో ఉన్న చరిత్ర కూడా బీజేపీకి ఉంది. అందుకే దక్షిణాదిలోకి చొచ్చుకు రావడానికి కర్ణాటకను ప్రధాన ద్వారంగా భావించిన బీజేపీకి ఇది ఎదురు దెబ్బే అని చెప్పాలి.
2013 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఫోర్స్ అనే సంస్థ సర్వే ద్వారా వెల్లడించింది. ఈ తాజా సర్వే కూడా అదే సంస్థ చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణులకు గెలుపుపై విశ్వాసం బలపడింది. కాగా 2013 ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పడం విశేషం. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఓటర్ల శాతం కూడా కాంగ్రెస్‌కు అమాంతం పెరిగిపోనుందట. 46శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ విజయ దుంధుభి మోగించనుండగా 31 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉండనుందని సర్వేలో పేర్కొంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT