సుమలత ఇంట తీవ్ర విషాదం.. అంబరీశ్ ఇకలేరు..

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ ...
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ (66) అకాల మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన చికిత్స పొందుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిన్న(శనివారం) అంబరీశ్‌కు గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు చికిత్స చేసినా లాభం లేకుండా పోయింది. రాత్రి 11 గంటల సమయంలో ఆయన మరణించారని వైద్యులు తెలియజేశారు. కాగాప్రఖ్యాత నటుడిగా పేరుతెచ్చుకున్న అంబరీశ్ 200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. అంబరీశ్‌కు భార్య సుమలత, కొడుకు అభిషేక్ ఉన్నారు. భార్య సుమలత ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.
ఇదిలావుంటే అంబరీశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగానూ ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు కూడా చేపట్టారు. యూపీఏ–1 ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా కొన్ని నెలలు పనిచేశారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. అంబరీశ్ మరణవార్త తెలుసుకున్న వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్, కన్నడ నటులు పునీత్ రాజ్‌కుమార్, యశ్‌లు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబరీశ్ మృతిచెందిన విషయాన్నీ తెలుసుకున్న టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ లు సుమలతను ఫోనులో పరామర్శించారు. ఇవాళ కొందరు బెంగుళూరు వెళ్లే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT