వాడు మొగుడు కాదు…రాక్షసుడు

వాడు మొగుడు కాదు…రాక్షసుడు
x
Highlights

భర్త వేధింపులు తాళలేకపోతున్నానని శాండిల్‌వుడ్‌ నటి చైత్రా మంగళవారం బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు..2006 లో తనకు,...

భర్త వేధింపులు తాళలేకపోతున్నానని శాండిల్‌వుడ్‌ నటి చైత్రా మంగళవారం బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు..2006 లో తనకు, లిక్కర్ రియల్టర్ బాలాజీ పోతరాజ్ తో వివాహమైందని, తమకు ఇద్దరు పిల్లలున్నారని పేర్కొన్న ఆమె..నెల రోజులుగా పోతరాజ్ నుంచి వేధింపులు మరింత పెరిగాయని తెలిపింది.

ఈ నెల 14 న చిన్న విషయానికే నాతో గొడవ పెట్టుకుని ముఖంపై దాడి చేశాడు. నా జుట్టు పట్టుకుని తలను గోడకేసి బాదాడు..ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. నేను స్పృహ కోల్పోగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఒకరోజు నన్ను హత్య చేస్తాడని హడలిపోతున్నాను. అతడినుంచి నాకు రక్షణ కల్పించండి అని చైత్ర తన ఫిర్యాదులో అభ్యర్థించింది. అమూల్య అనే యువతితో పోతరాజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తనను ఇంటినుంచి గెంటివేసేందుకు ప్రయతిస్తున్నాడని ప్రస్తుతం తన తలిదండ్రుల వద్ద ఉంటున్న చైత్ర పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చైత్ర..ఖుషి, శిష్య వంటి సినిమాల్లో నటించింది.
Mallywood Actress Chaitra Complaint On Her husband - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories