అందుకే బాబుకు కోర్టు వారెంట్ జారీ చేసింది : కన్నా

అందుకే బాబుకు కోర్టు వారెంట్ జారీ చేసింది : కన్నా
x
Highlights

సీఎం చంద్రబాబు నాయుడుకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీలో తమ ప్రమేయం లేదంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. వరుసగా 22 వాయిదాలకు...

సీఎం చంద్రబాబు నాయుడుకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీలో తమ ప్రమేయం లేదంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. వరుసగా 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్లే నోటీసులు జారీ అయ్యాయన్నారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వస్తుందని వివరించారు. ఆపరేషన్ గరుడ గురించి అందరికి కంటే చంద్రబాబుకే ఎక్కువగా తెలుసన్నారు కన్నా. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories