వైసీపీలోకి భారీగా వలసలు

వైసీపీలోకి భారీగా వలసలు
x
Highlights

వైసీపీ లో చేరికల ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకున్నాయి. సామాజిక వర్గాల వారిగా పేరున్న నేతలను పార్టీలోకి...

వైసీపీ లో చేరికల ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకున్నాయి. సామాజిక వర్గాల వారిగా పేరున్న నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఎన్నికల సమయానికి పార్టీని‌బలోపేతం చేసుకోవాలని వైసీపి భావిస్తోంది. రానున్న రోజుల్లో బలమైన నాయకులకు రెడ్ కార్పెట్ పరచాలని వైసీపీ డిసైడైంది.

కృష్ణా జిల్లాలో పాదయాత్ర ముగిసేలోగా కీలకనేతలు వైసీపిలోకి క్యూ క్యూడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపిలో రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఎదురు చూసిన సీనియర్ నేత కన్నా లక్ష్మి నారాయణకు నిరాశ ఎదురు కావడంతో ఇప్పుడు వైసీపి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నెల25 న గుడివాడలో జగన్ సమక్షంలో వైసీపి లో చేరుతున్నారు. కన్నా రాకతో గుంటూరు జిల్లా పార్టీ మరింత బలపడుతుందని‌ వైసీపి బావిస్తోంది.

ఇక కర్నూలు జిల్లాలో సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఈ నెల 29న జగన్‌ ను కలసి పార్టీలో చేరనున్నారు. అయితే కాటసాని ఎక్కడనుండి పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే పాణ్యం నుండి వైసీపీ ఎమ్మెల్యే వున్న గౌరు చరితా రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనుండటంతో కాటసాని ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నది తేలాల్సి వుంది.

ఇక మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈ నెల 27న వైసీపీ గూటికి చేరనున్నారు. ఇప్పటికే కృష్ణప్రసాద్‌కు మైలవరం సీటు ఖరారు చేసినట్లు కూడా వైసీపి నేతలు చెబుతున్నారు. వ్యాపారవేత్త కావడంతో చాలా కాలం నుంచి వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

అనంతపురంలో గతంలో పార్టీకు గుడ్ బై చెప్పిన గుర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడంతో నారాయణ రెడ్డి కుమారులు కూడా వైసీపిలోకి రానున్నారు. ఇప్పటికే పాదయాత్రలో జగన్ కలిసిన ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు మే 9 బీ నారాయణ రెడ్డి వర్ధంతి నాడు‌ నుంచి జిల్లాలో పార్టీ కార్యక్రమాలలో పాల్గుంటామని జగన్ కి స్పష్టం చేసారు. ఇక గుంటూరు జిల్లాలోని టీడిపి కీలకనేత ఒకరు త్వరలో చేరేలాగా వైకాపా సీనియర్ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. మరి కొద్దిమంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లతో కూడా వైసీపీ నేతలు టచ్ లో వున్నారని.. త్వరలో టీడీపీ నుండి‌ వలసలుంటాయని నేతలంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories