కమలేశ్వారూపం వస్తుందోచ్

కమలేశ్వారూపం వస్తుందోచ్
x
Highlights

మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపాలని కమల్ పార్ట్ 2 తో సిద్ధం, తహతహ లాడే అభిమానులంతా, విడుదలకై నూరు కనులతో సన్నద్ధం. శ్రీ.కో నటపిపాసి కమల్ హాసన్...

మరోసారి తన నటనా విశ్వరూపాన్ని
చూపాలని కమల్ పార్ట్ 2 తో సిద్ధం,
తహతహ లాడే అభిమానులంతా,
విడుదలకై నూరు కనులతో సన్నద్ధం. శ్రీ.కో

నటపిపాసి కమల్ హాసన్ సినిమాలంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కమల్ సినిమాల ఎదురు చూస్తుంటారు ఆయన అభిమానులు. కమల్ స్వీయ దర్శకత్వంలో విశ్వరూపం 2 చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన టీజర్స్, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మూవీ తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories