కాలా వర్సెస్‌ కర్ణాటక... కన్నడిగుల కథేంటసలు!!

కాలా వర్సెస్‌ కర్ణాటక... కన్నడిగుల కథేంటసలు!!
x
Highlights

క, కా... ‘క’ గుణింతంలో పక్క పక్క అక్షరాలు.. కానీ కలవడానికి ససేమిరా అంటున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.. కధన రంగంలో తలపడేందుకు...

క, కా... ‘క’ గుణింతంలో పక్క పక్క అక్షరాలు.. కానీ కలవడానికి ససేమిరా అంటున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.. కధన రంగంలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.. ఇంతకీ ఈ క, కా లేంటి.. కయ్యానికి కాలు దువ్వడమేంటి.. అర్ధం కావట్లేదా.. అయితే ఈ స్టోరీ చదవండి.

ఇక్కడ ‘క’ అంటే కర్ణాటక, కా అంటే కావేరి, కాలా.. సూపర్ స్టార్ రజినీకి ‘క’ అక్షరతో గండం ఉన్నట్లుంది.. గతంలో భారీ ఎక్స్ పెక్టేషన్స్‌తో వచ్చిన కబాలి అనుకున్న స్థాయిలో ఆడలేదు.. ఇక తాజాగా కాలా మూవీ కర్ణాటకలో విడుదలకు నోచుకునే అవకాశం కనిపించడం లేదు. కావేరీ జల వివాదంపై రజనీ వ్యాఖ్యలకు నిరసనగా కన్నడిగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ కాలా సినిమాపై పడనుంది.. జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే కాలాను అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరిస్తున్నారు.. దీనికి తోడు కన్నడ సినీ ఇండస్ట్రీ కూడా రజనీ సినిమాను బ్యాన్ చేయాలని పిలుపునిస్తోంది..

కబాలి దర్శకుడు రంజితే కాలా సినిమాకు కూడా డైరెక్షన్ చేశాడు.. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాళం, కన్నడ, జపాన్ భాషల్లో.. జూన్ 7న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది.. ఇక ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా అనూహ్య స్పందన రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ కుషీగా ఉంది.. అయితే కర్ణాటకలో మాత్రం సినిమా రిలీజ్ పై నీలి మేగాలు అలముకున్నాయి.. రజినీ కర్ణాటకపై అనుసరిస్తున్న విధానం వాళ్లకు నచ్చట్లేదు.. కావేరి జల వివాదంలో రజినీ తమిళనాడుకే సపోర్ట్ ఇవ్వడంతో కన్నడ వాసుల కోపం తారాస్థాయికి చేరింది.. దీంతో రజినీ సినిమాను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు..

కాలా కర్ణాటక పంపిణీదారులతో కాలా దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గురువారం నాటికి కాలా విడుదలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో రజినీ సినిమాలను ఎంతో ప్రోత్సహించే కర్ణాటక ప్రజలు.. కావేరి వివాదం తర్వాత పూర్తిగా మారిపోయారు.. రజనీ ఏ సినిమా చేసిన తమ రాష్ట్రంలో రిలీజ్ చేయకుండా అడ్డుకుంటామంటున్నారు. మరి కావేరి వివాదం రగులుతున్న సమయంలో.. కాలా సినిమా.. కర్ణాటకలో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories