logo
సినిమా

కాజ‌ల్ 'పారిస్ పారిస్‌'

కాజ‌ల్ పారిస్ పారిస్‌
X
Highlights

కాజ‌ల్‌కి ఈ ఏడాది బాగా క‌లిసొచ్చింది. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల రూపంలో తెలుగునాట మంచి...

కాజ‌ల్‌కి ఈ ఏడాది బాగా క‌లిసొచ్చింది. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల రూపంలో తెలుగునాట మంచి విజ‌యాలు ద‌క్కాయి. మ‌రోవైపు ఆమె న‌టించిన భారీ బ‌డ్జెట్ త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' విడుద‌ల‌కి సిద్ధమైంది. తెలుగులో 'అదిరింది' పేరుతో రానున్న ఈ చిత్రంలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేశారు. ఈ సినిమా విజ‌యంపై కాజ‌ల్ పూర్తి న‌మ్మ‌కంతో ఉంది.

కాగా, హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించిన 'క్వీన్'కి.. త‌మిళ రీమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి 'పారిస్ పారిస్' అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కంగ‌నాని ఫాలో కాకుండా.. త‌న‌దైన శైలిలో ఈ పాత్ర‌ని చేయ‌బోతున్న‌ట్లు కాజ‌ల్ తెలిపింది.

ఇదిలా ఉంటే.. త‌మిళంలో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలోనూ 'క్వీన్' రీమేక్ కానుంది. పారుల్ యాద‌వ్ న‌టిస్తున్న క‌న్న‌డ వెర్ష‌న్ 'క్వీన్‌'కి కూడా ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌కుడు కాగా.. తెలుగులో త‌మ‌న్నా, మ‌ల‌యాళంలో మంజిమా మోహ‌న్ 'క్వీన్' రీమేక్స్‌లో న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Next Story