జూనియర్ ప్రచారంపై నేడు స్పష్టత..?

nanireddy
Updated on: 24 Dec 2018 4:22 PM IST
జూనియర్ ప్రచారంపై నేడు స్పష్టత..?
X

కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఆమె సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తారా..లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై ఇవాళ(ఆదివారం) స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్...తన ప్రచారంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆయన ఈ నెల 30వతేదీ తర్వాత కూకట్‌పల్లిలో పర్యటిస్తారని టీటీడీపీ నేతలు ఇటీవల ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో తెలుగుదేశం నేతల్లో అయోమయం నెలకొంది. అయితే జూనియర్ ప్రచారంపై ఇవాళ స్పష్టత రావచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే హరికృష్ణ మరణం సమయంలో ఆయన దహన సంస్కారాలను ప్రభుత్వం తరుపున దగ్గరుండి పర్యవేక్షించారు కేసీఆర్, కేటీఆర్. ఈ నేపథ్యంలో ప్రచారానికి వస్తే ప్రభుత్వంపై విమర్శలు చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే తెరాస శ్రేణులు సైతం జూనియర్ పై విరుచుకుపడే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో ఎన్టీఆర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story