జేపీ వ్యాఖ్యలు అభ్యంతరకరం: ఐవైఆర్‌

జేపీ వ్యాఖ్యలు అభ్యంతరకరం: ఐవైఆర్‌
x
Highlights

జేఎఫ్సీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయ్. రెవెన్యూ లోటు, వెనుకబడ్డ ప్రాంతాలు, పోలవరం, పన్నుల రాయితీలు, జాతీయ సంస్థల ఏర్పాటు వంటి...11కీలక అంశాలపై...

జేఎఫ్సీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయ్. రెవెన్యూ లోటు, వెనుకబడ్డ ప్రాంతాలు, పోలవరం, పన్నుల రాయితీలు, జాతీయ సంస్థల ఏర్పాటు వంటి...11కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడిగిన లెక్కల వివరాలను పంపాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం కోరింది ? ఏపీకి కేంద్రం ఏమిచ్చింది అన్న వివరాలను పవన్‌ కల్యాణ్‌కు పంపుతోంది. సీనియర్ ఐఏఎస్‌ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, బాలసుబ్రమణ‌్యంలు మెయిల్‌ ద్వారా పవన్‌కు వివరాలు పంపుతున్నారు.

మరోవైపు నిధుల ఖర్చుల విషయంలో కేంద్రానికి రాష్ట్రం జవాబుదారీ కాదన్న జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యలను ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తప్పుపట్టారు. జేపీ వ్యాఖ్యలతో ఏకీభవించనన్న ఐవైఆర్‌ కృష్ణారావు కేంద్రానికి రాష్ట్రాలను నిధుల ఖర్చుల వివరాలు అడిగే హక్కు ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories