టీఆర్‌ఎస్‌లో చేరిన నటుడు

టీఆర్‌ఎస్‌లో చేరిన నటుడు
x
Highlights

తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. టీవీ, ఫిలిం యాక్టర్, హైకోర్టు అడ్వకేట్‌ జేఎల్‌ శ్రీనివాస్‌ కుందన్‌బాగ్‌లోని మాజీ...

తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. టీవీ, ఫిలిం యాక్టర్, హైకోర్టు అడ్వకేట్‌ జేఎల్‌ శ్రీనివాస్‌ కుందన్‌బాగ్‌లోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వాటికి ఆకర్షితుడినై తాను పార్టీలో చేరుతున్నానన్నారు. 30 ఏళ్లుగా టీవీ, సినిమా రంగంలో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్‌లో నటించానన్నారు. 1969 ఉద్యమంలో కూడా పాల్గొన్నానన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాను నగరంలో ఉంటున్నట్లు చెప్పారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమ ఫిలింనగర్‌కు వచ్చి ఎలా స్థిరపడిందో, అదే విధంగా బుల్లితెర కోసం టీవీనగర్‌ స్థాపన జరగాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో తమ బృందంతో ప్రచారం నిర్వహించడమే కాకుండా, పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 60 ఏళ్లలో చేయలేని పనులను టీఆర్‌ఎస్‌ పార్టీ గడిచిన కొద్ది రోజుల్లో చేసిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories