జియో కష్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు

lakshman
Updated on: 24 Dec 2018 12:26 PM IST
జియో కష్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు
X

కొత్త సంవత్సరానికి ఇంకా మరో వారం రోజులు ఉండగానే తన కస్టమర్లకు జియో శుభవార్త తెలిపింది. తాజాగా మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. "హ్యాపీ న్యూ ఇయర్ 2018" పేరిట రెండు కొత్త ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు రూ.199, రూ.299 ధరను కలిగివున్నాయి.

ఈ రెండింటి వాలిడిటీ 28 రోజులు ఉండగా, రెండింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఇక రూ.199 ప్లాన్‌లో రోజుకు 1.2 జీబీ డేటా లభిస్తుంది. అదే రూ.299 ప్లాన్‌లో అయితే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది.

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు రూ.199 ప్లాన్లను లాంచ్ చేసిన నేపథ్యంలో వాటికి పోటీగా జియో ఈ రెండు కొత్త ప్లాన్లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దేశీయ టెలికాం రంగంలో జియో తన సేవలు ప్రారంభించిన తర్వాత టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధానికి తెరలేచింది. ఫలితంగా అన్ని టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గించిన విషయం తెల్సిందే.

lakshman

lakshman

Next Story