బీజేపీ ఎమ్మెల్యేను కలిసిన సీబీఐ మాజీ జేడీ

బీజేపీ ఎమ్మెల్యేను కలిసిన సీబీఐ మాజీ జేడీ
x
Highlights

ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఎవరూ ఊహించని విధంగా నాయకులంతా.. ఒక్కొక్కరిని...

ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఎవరూ ఊహించని విధంగా నాయకులంతా.. ఒక్కొక్కరిని కలుస్తూ వస్తున్నారు. తాజాగా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారం.. కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగానికి.. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా రైతులతో పాటు విభిన్న వర్గాలతో సమావేశమై వారందరి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో.. ఆయన రాజకీయాల్లోకి వస్తారని కన్‌ఫార్మ్ అయిపోయింది. కానీ.. ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం క్వశ్చన్ మార్క్‌గానే మిగిలిపోయింది.

ఐతే.. కొంతకాలంగా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు.. బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే.. ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్తున్నారు. అందుకే.. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. ఇప్పటి నుంచే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య లక్ష్మీనారాయణ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజమహేంద్రవరంలో.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లక్ష్మీనారాయణ.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లి కలిశారు. కాసేపు ఆయనతో సమావేశమయ్యారు. స్నేహపూర్వకంగానే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లానని లక్ష్మీనారాయణ చెప్తున్నా.. మేటర్ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories