logo

జయప్రద అసలు పేరు మీకు తెలుసా!

జయప్రద అసలు పేరు మీకు తెలుసా!

ప్రముఖ హీరొయిన్ జయప్రద అసలు పేరు మీకు తెలుసా! జయప్రద అసలు పేరు...లలితారాణి. తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన లలితారాణి ప్రముఖ నటి మరియు పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది. జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి మరియు బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా, సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను కనుగొన్నాడు. ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో అవి తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ మరియు బెంగాలి లో 300కు పైగా సినిమాలలో నటించింది. శ్రీ.కో.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top