కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్‌: జేపీ

కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్‌: జేపీ
x
Highlights

ఒక టాప్ హీరోగా, కాలు మీద కాలేసుకుని జీవించాల్సిన పవన్ కల్యాణ్ కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయనను...

ఒక టాప్ హీరోగా, కాలు మీద కాలేసుకుని జీవించాల్సిన పవన్ కల్యాణ్ కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయనను చూడటానికి లక్షలాది మంది డబ్బులిచ్చి వస్తారని, కానీ ఆయన మాత్రం ఈ సమాజానికి ఏదో చేయాలన్న తపనతో సవాళ్లతో కూడిన జీవనంలోకి వస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం తనను కలిసిన పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఏమీ దక్కకపోవడం అన్యాయమని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. వీటిని విస్మరిస్తే... ప్రభుత్వాల మీద, పార్టీల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. కొన్నింటిని చట్టంలో పెట్టకపోయినప్పటికీ... సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి పార్లమెంటులో హామీల రూపంలో ఇచ్చారని... ఇప్పుడు చట్టంలో అవి లేవని దాటవేయడం దారుణమని అన్నారు. వీటన్నింటినీ మనం సమీక్షించుకోవాలని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories