అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన తీవ్ర విమర్శలు..!

అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన తీవ్ర విమర్శలు..!
x
Highlights

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఆ పార్టీ చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ఎమ్మెల్యే...

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఆ పార్టీ చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పై మండిపడ్డారు.. సోషల్ మీడియాలో వైసీపీ , జనసేనలు తిట్ల పురాణంపై జరిపిన చర్చా కార్యక్రమంలో భాగంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర అందరికి తెలిసిందే, నెల్లూరు జిల్లాలో ఆయనొక అవినీతిపరుడు, రౌడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.. అలాంటివారు పార్టీలో ఉంటే ఉన్మాదులు తయారవుతారని కిరణ్ రాయల్ అన్నారు.. దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం కన్వినర్ నాగార్జున యాదవ్ స్పందిస్తూ.. జనసేన నేతలకు దమ్ముంటే అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి, లేదా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు..

Show Full Article
Print Article
Next Story
More Stories