యువ సేన నయా దీక్ష

x
Highlights

దేవుళ్ళ పేరుతో మాలలు వేసుకోవడం దీక్షలు చేయడం మనకు మామూలే. కానీ దేవుళ్ళ కోసం కాకుండా ఓ లక్ష్యం కోసం సమస్యల పరిష్కారం కోసం మాలలు వేయడం దీక్షలు చేయడం...

దేవుళ్ళ పేరుతో మాలలు వేసుకోవడం దీక్షలు చేయడం మనకు మామూలే. కానీ దేవుళ్ళ కోసం కాకుండా ఓ లక్ష్యం కోసం సమస్యల పరిష్కారం కోసం మాలలు వేయడం దీక్షలు చేయడం ఎక్కడైనా చూశారా. లేదు కదూ అయితే మనం తప్పకుండా కడియంలో జరుగుతున్న నయా దీక్షను చూడాల్సిందే. కొత్తగా సేనాని దీక్ష. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఇప్పుడు ఇది న్యూ ట్రెండ్. వీరంతా దేవుళ్ళ భక్తులు కారు. దేవుడి కోసం దీక్ష చేపట్ట లేదు. వీరంతా జన సైనికులు. పవన్ కల్యాణ్ అభిమానులు 9 మంది ఇలా ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో మాల ధరించి దీక్షలు చేపట్టారు. నిష్టగా ఉంటూ చెప్పులు కూడా వేసుకోకుండా ఊరూరా తిరుగుతున్నారు.

సేనాని దీక్ష. లక్ష్యం జనసేన సిద్దాంతాల్ని, పార్టీ మేనిఫిస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అలాగే ఓటర్లు నమోదు, సభత్వ నమోదు చేయడం. సేనాని దీక్ష మొత్తం 21 రోజుల పాటు ఉంటుందట. అంతేకాదు దేవుడి దీక్ష తరహాలోనే నిష్టగా ఉండి సర్వమత ప్రార్థనలు చేస్తారు. అలాగే 21 రోజుల పాటు ఆలయాల దగ్గరే బస చేస్తారు. పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు ఎంతో పవిత్రంగా వున్నాయని, అందుకే అంతే పవిత్రంగా ప్రచారం చేపట్టామని అభిమానులు చెబుతున్నారు. 21రోజుల తర్వాత సేనాని దీక్షను పవన్ కళ్యాణ్ సమక్షంలో విరమిస్తామంటున్నారు మాలధారులు. మొత్తానికి పవన్ అభిమానులు చేపట్టిన జనసేన మాల దీక్ష కడియం ప్రాంతంలో విశేషంగా ఆకట్టుకుటంది.

Show Full Article
Print Article
Next Story
More Stories