నేడు జనసేన కీలక ప్రకటన.. అదే విషయం చెబుతారా?
తెలంగాణలో సంస్థాగతంగా బలంగా లేమని చెబుతూ ఎన్నికలకు దూరంగా ఉంది జనసేన పార్టీ. అయితే పొత్తులు, అభిమానుల ఒత్తిడి దృష్ట్యా ఈనెల 5వ తేదీన కీలక ప్రకటన చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ క్రమంలో పవన్ ఏం నిర్ణయం వెల్లడిస్తారా అని జనసేన కార్యకర్తలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ను కలిసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో టీఆరెస్ కు మద్దతుగా మాట్లాడారు. దాంతో ఈ ఎన్నికల్లో టీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని పవన్ అనుకుంటున్నారని ఇతర పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు కూటమిని వ్యతిరేకించి ఎవరికైనా ఓటు వేయండి అని చెప్పే అవకాశమున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Next Story




