logo
జాతీయం

శ్రీనగర్‌లో ఉగ్ర కాల్పులు.. పాక్ ఖైదీ పరారీ

శ్రీనగర్‌లో ఉగ్ర కాల్పులు.. పాక్ ఖైదీ పరారీ
X
Highlights

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని శ్రీ మహరాజా హరి సింగ్‌ హాస్పిటల్‌లో...పోలీసులే...

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని శ్రీ మహరాజా హరి సింగ్‌ హాస్పిటల్‌లో...పోలీసులే టార్గెట్‌ చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయ్. పాకిస్థాన్‌కు చెందిన ఖైదీ నవీద్‌ను చికిత్స నిమిత్తం భద్రతా బలగాలు ఆస్పత్రికి తీసుకువచ్చాయి. ఈ సమయంలో ఆస్పత్రి వద్ద మాటు వేసిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఖైదీ నవీద్ బలగాల చెర నుంచి తప్పించుకున్నాడు. తక్షణమే ఉగ్రవాదులు కూడా పారిపోయారు. ఉగ్రవాదులు, ఖైదీ నవీద్ కోసం భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ ప్రాంతంలో బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

Next Story