జగపతి బాబు గారి నాన్న గారు

జగపతి బాబు గారి నాన్న గారు
x
Highlights

జగపతి బాబు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పుడు ఎవ్వరు ఉండకపోవచ్చు, అయితే వారి నాన్న గారి గురించి మీకు తెలుసా! వారు నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా...

జగపతి బాబు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పుడు ఎవ్వరు ఉండకపోవచ్చు, అయితే వారి నాన్న గారి గురించి మీకు తెలుసా! వారు నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్ధిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. అరవై, డెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ హిందీ భాషలలో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఫిల్మ్ నగర్ లో దేవాలయ నిర్మాణానికి నడుంకట్టి, దైవసన్నిధానాన్ని ఏర్పాటు చేసారు వీరు..శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories