జగన్‌ 2 రోజుల పాటు  పాదయాత్రకు విరామం?

nanireddy
Updated on: 24 Dec 2018 3:39 PM IST
జగన్‌ 2 రోజుల పాటు  పాదయాత్రకు విరామం?
X

హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. జగన్ పై దాడి, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు, తదనంతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. జగన్‌పై దాడి కేసులో ఎవరి పాత్ర ఉందనేదానిపై చర్చిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే డీజీపీ ఎందుకు స్పందించాల్సి వచ్చింది..? లేఖలు ఉన్నాయని ముందుగానే ప్రకటించిన డీజీపీ.. సాయంత్రం వరకు ఎందుకు బహిర్గతం చేయలేదనే అంశాలపై ప్రదానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గాయం కారణంగా జగన్‌ 2 రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story