జగన్ పుట్టిన రోజునాడే ఆ సినిమా..

nanireddy
Updated on: 24 Dec 2018 4:42 PM IST
జగన్ పుట్టిన రోజునాడే ఆ సినిమా..
X

దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా పూర్తైపోయింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ ఆర్ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైయస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న ట్రైలర్ రిలీజ్‌ చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని ఆనందో బ్రహ్మా ఫేమ్ మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది యాత్ర. వైసీపీ అధినేత.. కాగా ఈ సినిమా అందరూ అనుకున్నట్టు ఈనెలలో విడుదల కావడం లేదు. 2019 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వారు వేసినట్టు చెప్పుకొచ్చారు.

nanireddy

nanireddy

Next Story