జాదవ్ అండ్ రాంబాబు గ్యాంగ్ ఆటకట్టు

x
Highlights

మోస్ట్ వాంటెడ్‌ జాదవ్ అండ్ రాంబాబు గ్యాంగ్‌ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. గత కొన్ని నెలలుగా జంటనగరాల పరిధిలో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న...

మోస్ట్ వాంటెడ్‌ జాదవ్ అండ్ రాంబాబు గ్యాంగ్‌ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. గత కొన్ని నెలలుగా జంటనగరాల పరిధిలో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న రెండు ముఠా సభ్యులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

రెక్కీ నిర్వహిస్తారు.. ప్లాన్‌ను అమలు చేస్తారు.. ఇళ్లును గుల్ల చేస్తారు.. కొన్ని నెలలుగా హైదరాబాద్, సైబరాబాద్ శివారు ఇళ్లల్లో చోరీలు, దోపిడీలు చేస్తూ జంటనగర వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జాదవ్ అండ్ రాంబాబు గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చేసుకుని రాంబాబు గ్యాంగ్ రైల్వే ట్రాక్‌ను ఆనుకుని ఇళ్లే లక్ష్యంగా జాదవ్ ముఠా చోరీలకు పాల్పడుతాయని పోలీసులు తెలిపారు. గతంలో చందానగర్, గచ్చీబౌలి, రాయదుర్గం, మీర్‌పేట్‌ లో దొంగతనాలు చేసి అరెస్ట్ అయ్యారని అయితే బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కూడా సవాల్‌గా నిలిచారు.

ఈ ముఠాలపై నిఘా పెట్ట్టిన పోలీసులు ఎట్టకేలకు వీరి ఆగడాలకు చెక్ పెట్టారు. వీరి నుంచి 35 కేసుల్లో దోచుకున్న సొమ్మును రికవరీ చేశారు. 50 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ముఠాల పైన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories