logo
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరోసారి ఐటీ దాడులు

X
Highlights

మొన్న నెల్లూరు, నిన్న విజయవాడ తాజాగా విశాఖలో ఐటీ దాడుల కలకలం రేగింది. ఐటీ దాడులు జరుగుతాయంటూ నిన్నటి నుంచి...

మొన్న నెల్లూరు, నిన్న విజయవాడ తాజాగా విశాఖలో ఐటీ దాడుల కలకలం రేగింది. ఐటీ దాడులు జరుగుతాయంటూ నిన్నటి నుంచి వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఈ తెల్లవారుజాము నుంచే విశాఖలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. దువ్వాడ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధిలోని పలు కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. TGI కంపెనీలో సోదాలు చేపట్టిన అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఐటీ రైడ్స్ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్‌ఈజెడ్ పరిధిలో భారీగా పోలీసులను మోహరించారు .

Next Story