ఇస్రోకు ఎదురుదెబ్బ

ఇస్రోకు ఎదురుదెబ్బ
x
Highlights

జీశాట్‌-6ఎ శాటిలైట్‌. 2వేల 66 టన్నుల బరువు 270 కోట్ల ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. GSLV రాకెట్‌ ద్వారా గురువారం నింగిలోకి విజయవంతంగా...

జీశాట్‌-6ఎ శాటిలైట్‌. 2వేల 66 టన్నుల బరువు 270 కోట్ల ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. GSLV రాకెట్‌ ద్వారా గురువారం నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని మల్టీ బీమ్‌ కవరేజీ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్‌ కమ్యూనికేషన్‌ను అందించేలా తయారుచేశారు. అయితే చివరి దశలో కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. గత గురువారం ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన, అధునాతన ఉపగ్రహం జీశాట్-6ఎ శాటిలైట్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

జీశాట్-6ఎ శాటిలైట్‌ను చివరి కక్ష్యలో ప్రవేశపెట్టే సమయంలో లింకు తెగినట్లు ఇస్రో తెలిపింది. ఉపగ్రహానికి సంబంధించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో వివరించారు. జీశాట్-6ఎ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని ఉపగ్రహాన్ని ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో ప్రకటించింది.

ఏదైనా శాటిలైట్‌ను లాంచ్ చేసినప్పుడు దానికి కొంతకాలం వరకు భూమికి దగ్గరగా ఉంచుతారు. ఆ తర్వాత తుది కక్ష్యలోకి ప్రవేశపెడతారు. జీశాట్-6ఎ విషయంలోనూ తొలి రెండు దశలు విజయవంతమయ్యాయి. చివరి దశ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో శాటిలైట్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. అయితే ఈ లోపాన్ని పునరుద్ధరించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. లింక్ తెగడానికి కచ్చితమైన కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories