ఉప్పల్‌లో దారుణం...సెల్‌ ఫోన్‌ కోసం స్నేహితుడి హత్య

ఉప్పల్‌లో దారుణం...సెల్‌ ఫోన్‌ కోసం స్నేహితుడి హత్య
x
Highlights

హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ కోసం ఫ్రెండ్‌ను అతి దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్‌...

హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ కోసం ఫ్రెండ్‌ను అతి దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్‌ రామాంత్‌పూర్‌కు చెందిన ప్రేమ్‌, సాగర్‌ మిత్రులు. ఇద్దరూ ఈ నెల 13న ఆడుకుంటున్న సమయంలో ప్రేమ్‌ వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌ను సాగర్‌ చూశాడు. తనకి ఇవ్వమని కోరగా ప్రేమ్‌ నిరాకరించాడు. ఈక్రమంలో మరుసటి రోజు లాంగ్‌ డ్రైవ్‌ పేరుతో ప్రేమ్‌ను తీసుకెళ్లిన సాగర్‌.. అతడిని కిడ్నాప్‌ చేశాడు. మొబైల్‌ ఫోన్‌ తీసుకుని.. ప్రేమ్‌ను ఆదిభట్ల ప్రాంతంలో పెట్రోల్‌ పోసి కాల్చేశాడు. ఆ మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. సాగర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిగా.. సెల్‌ఫోన్‌ కోసం తానే ప్రేమ్‌ను చంపేశానని అంగీకరించాడు. సాగర్‌కు ఇంకెవరైనా సహకరించారా లేక ఒక్కడే ఈ ఘోరానికి పాల్పడ్డాడనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories