హైదరాబాద్‌లో విషాదం ... డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్ధిని మృతి

హైదరాబాద్‌లో విషాదం ... డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్ధిని మృతి
x
Highlights

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని కాలేజీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థిని అక్కడిక్కడి చనిపోయింది. ఈ ఘటనతో...

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని కాలేజీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థిని అక్కడిక్కడి చనిపోయింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థులు కాలేజీ బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. జగద్గిరిగుట్టలో నివసించే రమ్య కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈరోజు ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన రమ్య.. కూకట్‌పల్లి బస్టాప్‌లో దిగి రోడ్డు దాటుతుండగా అదే కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రమ్య మృతికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ సహ విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. బస్సు అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

High Tension In Kukatpally Over Bus Accident Issue - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories