వరిసాగులో విప్లవం సృష్టించిన సుగుణమ్మ

x
Highlights

కన్నీటి కష్టాలకు కుంగిపోలేదు అడుగడుగునా ఎదురైన సమస్యలకు చలించలేదు.. అప్పుల బాధ తో చెట్టంత కొడుకు పోయినా ఆ తల్లి ముగ్గురు బిడ్డల బాగు కోసం అరక పట్టింది...

కన్నీటి కష్టాలకు కుంగిపోలేదు అడుగడుగునా ఎదురైన సమస్యలకు చలించలేదు.. అప్పుల బాధ తో చెట్టంత కొడుకు పోయినా ఆ తల్లి ముగ్గురు బిడ్డల బాగు కోసం అరక పట్టింది చెలక దున్నింది ఆధునిక వ్యవసాయ పద్ధతి లో శ్రీ వరి సాగు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటోంది వరిసాగులో విప్లవం సృష్టించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండించి ఆదర్శంగా నిలుస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన సుగుణమ్మ. అమెరికా లో 40 దేశాలు పాల్గొన్న సదస్సు లో తన వ్యవసాయ మెళకువలను ప్రదర్శించి ఆదర్శ రైతు గా ఖండాంతర ఖ్యాతి గడించింది. సొంత భూమి లేకున్నా సొంత కాళ్లపై నిలబడి సాగులో రాణిస్తున్న సుగుణమ్మపై ప్రత్యేక కథనం.

వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరుకు చెందిన సుగుణమ్మ ఎన్ని కష్టాలెదురైనా అధైర్య పడలేదు వర్షాలు లేక , వ్యవసాయం కోసం పెట్టిన పెట్టుబడులు అధికమై, అప్పుల బాధతో చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నా బిడ్డల చదువు కోసం వ్యవసాయాన్నే నమ్ముకుంది సాగులో ఆధునిక పద్ధతులను అవలంభించి అధిక దిగుబడులు సాధించింది

నిరుపేద కుటుంబానికి చెందిన సుగుణమ్మ కు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు కొడుకు వ్యవసాయ పనులు చురుగ్గా చేసేవాడు, కాలం కలిసి రాక పంట చేతికొచ్చే సమయానికి ఒక్కసారిగ వడగళ్ల వాన రావడం, కరెంట్ కోతలు వంటి కారణాలతో పొలం ఎండి పోయింది. పెట్టుబడికి తీసుకున్న అప్పు కట్టలేని స్థితి లో అప్పుల బాధతో కొడుకు పొలం వద్దే పురుగుల మందు తాగి చనిపోయాడు. కొడుకు చనిపోవడంతో దిక్కు తోచని స్థితిలో పడిన సుగుణమ్మ ఒకసారి గ్రామానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థ వ్యవసాయం పై సలహాలు సూచనలు చేయటం తో వాటిని పాటించింది. వ్యవసాయాన్ని లాభసాటి గా మలచుకుంది.

శ్రీ వరి సాగు చేసి ఎకరాకు 60 నుండి 70 బస్తాల ధాన్యం పండించి ఉత్తమ రైతుగా నిలిచింది. కట్కూరు గ్రామం లో అందరికి ఆదర్శ మహిళా రైతుగా మారింది సుగుణమ్మ ను చూసి ఆ గ్రామంలో వున్న వాళ్లంతా శ్రీవరి సాగు చేస్తున్నారు. 2010 సంవత్సరంలో లో యూఎస్ ఏ లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు లో పాల్గొంది సుగుణమ్మ. వ్యవసాయ రంగం లో ప్రతిభ చూపించిన 40 దేశాలకు చెందిన వారితో సదస్సులో పాల్గొని శ్రీ వరి సాగు లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అక్కడ వారికి నేర్పించి సదస్సు లో అందరి మెప్పు పొందింది.

తెలంగాణా ప్రభుత్వం ఉత్తమ రైతు గా గుర్తించినా, ప్రపంచ దేశాల సదస్సు లో తెలుగు మహిళా రైతు గా సత్తా చాటిన సుగుణమ్మ కు స్వంత భూమి లేదు కౌలు కు తీసుకుని పంటల సాగు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ప్రభుత్వ అండదండలు అందించాలని కోరుతుంది. ఇది ఆదర్శ రైతు సుగుణమ్మ కథ.. ఇలాంటి మహిళా రైతులు తెలంగాణా రాష్ట్రం లో ఎందరో వున్నారు మట్టిలో మాణిక్యాలు గా వున్న వీరందరినీ ప్రభుత్వం గుర్తించాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories