గుండెల్లోనా వేగం పెంచావే...

గుండెల్లోనా వేగం పెంచావే...
x
Highlights

గుండెల్లోనా వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే.. అంటూ ప్రతి ఇంట్లో మొగిపోయిన పాట ...గీత గోవిందం లోని పాట. ఈ గీతాన్ని వినని తెలుగువారు అరదు...

గుండెల్లోనా వేగం పెంచావే.. గుమ్మంలోకి హోలీ తెచ్చావే.. అంటూ ప్రతి ఇంట్లో మొగిపోయిన పాట ...గీత గోవిందం లోని పాట. ఈ గీతాన్ని వినని తెలుగువారు అరదు అంటే... అతిశేయోక్తి కాదేమో.
పల్లవి:

తదిగిన తకజను తదిగిన తకజను

తరికిట తదరిన తదీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ

మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’.

‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...’’

నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..

గుండెల్లోనా వేగం పెంచావే..

గుమ్మంలోకి హోలీ తెచ్చావే..

నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే..

నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే..

‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...’’

నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..

తదిగిన తకజను తదిగిన తకజను

తరికిట తదరిన తదీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ

మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’.

చరణం 1:

ఊహలకు దొరకని సొగసా..

ఊపిరిని వదలని గొలుసా..

నీకు ముడిపడినది తెలుసా..

మనసుని ప్రతి కొసా..

నీ కనుల మెరుపుల వరసా..

రేపినది వయసున రభసా..

నా చిలిపి కలలకు బహుశా..

ఇది వెలుగుల దశా..

నీ ఎదుట నిలబడు చనువే వీసా..

అందుకుని గగనపు కొనలే చూశా..
‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. ’’
చరణం 2:

మాయలకు కదలని మగువా..

మాటలకు కరగని మదువా..

పంతములు విడువని బిగువా..

జరిగినదడగవా????
నా కథను తెలుపుట సులువా?

జాలిపడి నిమిషము వినవా?

ఎందుకని గడికొక గొడవా??

చెలిమిగ మెలగవా...

నా పేరు తలచితే ఉబికే లావా..

చల్లబడి నను నువు కరుణించేవా?
‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. ’’

గుండెల్లోనా వేగం పెంచావే..

గుమ్మంలోకి హోలీ తెచ్చావే..

నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే..

నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే..
‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. ’’
తదిగిన తకజను తదిగిన తకజను

తరికిట తదరిన తదీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ

మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’.

మల్లి ఒక సారి ఈ పాట వినాలని అనిపిస్తుందాండి... మీకు. వినండి మరి...ఇంకేం ఆలశ్యం.. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories