కోహ్లీకి గాయం..తదుపరి టీ20కి అనుమానం!

కోహ్లీకి గాయం..తదుపరి టీ20కి అనుమానం!
x
Highlights

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. త‌ర్వాతి టీ-20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డా? కోహ్లీ...

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. త‌ర్వాతి టీ-20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డా? కోహ్లీ లేకుండానే బుధ‌వారం జ‌రుగ‌బోయే మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోందా? ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానాల కోస‌మే అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గాయం కార‌ణంగా త‌ర్వాతి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండ‌డం లేద‌ని తెలుస్తోంది.

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ గాయపడ్డాడు. టాస్‌ ఓడి తొలుత భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ చేతికి ఏమీ కాలేదు. కాలి నొప్పితో కాస్త బాధపడిన కోహ్లీ(26) ఆ తర్వాత శంసి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో 13వ ఓవర్ల్లో కోహ్లీ కాలి నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఫీల్డింగ్‌ చేయలేక మైదానన్ని వీడాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ..‘అదృష్టవశాత్తూ చేతికి ఎలాంటి గాయం అవ్వలేదు. కాలి గాయం కాస్త ఇబ్బంది పెడుతోంది’ అని తెలిపాడు. దీంతో దక్షిణాఫ్రికాతో తదుపరి టీ20లో కోహ్లీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇరు జట్ల మధ్య బుధవారం సిరీస్‌లో భాగంగా రెండో టీ20 జరగనుంది. ఒకవేళ గాయం తీవ్రంగా ఉండి కోహ్లీ దూరమైతే రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories