భార్య అనుమానం.. ఆ వీడియోలు పంపిన భర్త

భార్య అనుమానం.. ఆ వీడియోలు పంపిన భర్త
x
Highlights

తన భర్త సంసారానికి పనికి రాడని ఓ భార్య పెళ్లైన 15 రోజులకే కోర్టును ఆశ్రయించింది. కోపోద్రిక్తుడైన భర్త తన భార్యకు ఏలాగైనా బుద్ధి చెప్పాలని మరో మహిళతో...

తన భర్త సంసారానికి పనికి రాడని ఓ భార్య పెళ్లైన 15 రోజులకే కోర్టును ఆశ్రయించింది. కోపోద్రిక్తుడైన భర్త తన భార్యకు ఏలాగైనా బుద్ధి చెప్పాలని మరో మహిళతో కలిసి అశ్లీలంగా ఉన్న వీడియోను భార్య అమ్మనాన్నలకు పంపించాడు. సదరు భర్త, భార్యకు బుద్ది చెప్పబోయే క్రమంలో తానే ఇరుకునపడి జైలు పాలయ్యాడు. వివరాలు.. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ నగర్‌కు చెందిన విభావసుకు, తమిళనాడులో కొడింగ్యాయుర్‌లోని ముతామిజ్‌ నగర్‌కు చెందిన అనూషకు రెండేళ్లకిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన 15 రోజులకే అనూష తిరిగి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిపోయారు.

ఇరు కుటుంబాల వారు భార్య, భర్తలను కలపడానికి కౌన్సెలింగ్‌లు కూడా ఇప్పించారు. ఈ క్రమంలోనే తన భర్త నపుంసకుడని తనకు విడాకులు మంజూరు చేయాలని, అనూష ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఇది తెలిసిన విభావసు మరో మహిళతో అశ్లీలంగా ఉన్న వీడియోను తీసి అనూష కుటుంబ సభ్యులకు పంపాడు. పోర్న్‌ వీడియోను తన కుటుంబసభ్యులకు పంపడంపై అనూష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, తమిళనాడులోని ఎంకేబీ నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విభావసును అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories