ఇంద్రుడు చంద్రుడు!

ఇంద్రుడు చంద్రుడు!
x
Highlights

ఇంద్రుడు చంద్రుడు 1989లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇందులో కమల్ హాసన్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర...

ఇంద్రుడు చంద్రుడు 1989లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇందులో కమల్ హాసన్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో చరణ్ రాజ్, గొల్లపూడి, శ్రీవిద్య, నగేష్, పి. ఎల్. నారాయణ తదితరులు నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే... జి.కె. రాయుడు (కమల్ హాసన్) ఒక అవినీతిపరుడైన మేయర్. తన పి. ఎ త్రిపాఠి (చరణ్ రాజ్) సహాయంతో ఎన్నో అక్రమాలకు పాల్పడుతుంటాడు. వీటిని బయట పెట్టడానికి సాహసవంతురాలైన విలేకరి దుర్గ (విజయశాంతి) ప్రయత్నిస్తుంటుంది. అది తెలుసుకున్న జి. కె. రాయుడు ఆమెను బెదిరించి పంపేస్తాడు. కానీ దుర్గ మాత్రం అతన్ని గురించి మరింత సమాచారం సేకరిస్తుంది. అది తను పనిచేసే సాయంకాలం అనే పత్రికలో ప్రచురించబోయే సమయానికి జి. కె. రాయుడు వచ్చి ఆ ప్రెస్సును ధ్వంసం చేస్తాడు. మళ్ళీ దుర్గను బెదిరించపోగా మేయరు పేరు అడ్డుపెట్టుకుని త్రిపాఠి పెట్రోలు దొంగతనం గురించి చెబుతుంది. అంతే కాకుండా అతని దగ్గర పనిచేసే మీనా (జయలలిత) నిజానికి త్రిపాఠి భార్యయనీ, ఆమెను అడ్డుపెట్టుకుని త్రిపాఠి అక్రమంగా సంపాదిస్తున్నట్లు తెలుసుకుంటాడు....ఆ తర్వాత ఏమి జరిగిందనేదే కథ... అయితే ఇందులో కమల హసన్ నటన చాల అధ్బుతంగా చేసాడనే చెప్పాలి. మీరు ఇప్పటివరకు ఈ సినిమా చూడకుంటే మాత్రం ఒక సారి చూడండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories